![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో స్టార్ మా అవార్డ్స్ పొందిన వాళ్ళతో ఒక సక్సెస్ మీట్ పార్టీని ఒక ఎపిసోడ్ గా ఈ వారం ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. అందులో అవార్డు అందుకున్న నటకుమారి కూడా ఉంది. మిగతా వాళ్లంతా కలిసి ఆమెకు ఘనంగా స్టేజి మీద సత్కరించారు. ఆ తర్వాత శ్రీముఖి ఆమె జర్నీ గురించి అడిగేసరికి చాల ఎమోషనల్ ఐపోయి తన హిస్టరీ చెప్పింది. "మా తమ్ముడు పుట్టిన తర్వాత మా నాన్న గారు చనిపోయారు. మేము ఏడుగురం. అందులో ఇద్దరు కాలం చేశారు.
నేను నాలుగో దాన్ని. చాలా అంటే చాలా కష్టాలు పడ్డాం. వేరే ఆధారం లేదు. అప్పుడు ఈ నాటకాలు అనేవి మా అమ్మగారు అనుకోకుండా చేశారు. మా అమ్మది అసలు ఈ ఫీల్డ్ కూడా కాదు. అప్పుడే అల్లూరి సీతారామరాజు అనే నాటకంలో 100 వ సంవత్సరం నాడు నేను నాటకంలో నటించాను. ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమీ లేదు. నిజంగా మాకు అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకున్నది కళామ తల్లి. నాటకరంగం. చిన్న వయసు నుంచే నాటకాలు చేసి చేసి చేసి అనుకోకుండా 15 ఏళ్ళు అవుతోంది నేను ఈ టీవీ రంగంలోకి వచ్చి. స్టార్ మా వాళ్ళు నాకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. దేవత సీరియల్ లో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అందరూ భాగ్యమ్మ అంటూ పిలిచేవాళ్ళు. అన్ని షోస్ కి పిలుస్తూ నన్ను ఎంకరేజ్ చేసింది స్టార్ మా. ఇన్నేళ్ల స్టార్ మాతో ఉన్న జర్నీలో ఒక్క అవార్డు కూడా తీసుకోలేకపోయాను అని చాల బాధపడ్డాను.
నాకు ఇప్పుడు స్టార్ మా పరివారం వాళ్ళే అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు చూసాక మా ఊరు పిఠాపురంకి వెళ్ళినప్పుడు మన ఊరి పేరు నిలబెట్టావు నటకుమారి అని. నన్ను ఇంకా ఆడియన్స్ కి దగ్గర చేసింది స్టార్ మా" అంటూ చెప్పింది. ఇక తర్వాత హరి మాట్లాడాడు. "మన తీసుకునే అవార్డ్ కి పట్టుకునే అవార్డుకి ప్రాణం లేకపోవచ్చు కానీ ఆ ప్రాణం లేని అవార్డు మనలోని కళకు ప్రాణం పోస్తుంది. ఈ అవార్డు ఇంకో పది మైళ్ళు పరిగెత్తేలా చేస్తుంది. ప్రతీ ఆర్టిస్ట్ కి గుర్తింపు దక్కాలి.
![]() |
![]() |